మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో అధికంగా చెరకు పంట పండించే బెళగావి జిల్లాలో రైతులు తాము పండించిన చెరకుకు మద్దతు ధర ప్రకటించాలంటూ రోడ్డెక్కారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తోడు రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏడాది పాటు పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కోసం పారిశ్రామికవేత్తలు, సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహారాష్ట్రలో చెరకు రైతులకు రూ.3,750 ధర లభిస్తోంది. కర్ణాటకలో చెరకు నియంత్రణ మండలి ఉన్నా ఫలితం లేదనే భావన రైతుల్లో నెలకొంది. రాష్ట్రంలో చెరకు నియంత్రణ మండలి రైతుల తరఫున కాకుండా కేవలం పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారిందని, రైతులకు మరణ శాసనంగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రతి టన్నుకు రూ.3,500 ధర కేటాయించాలని రైతులు పట్టు పట్టారు. బెళగావి జిల్లాలో 2.90 లక్షల హెక్టార్లలో చెరకును పండించారు. గతంలో జిల్లాలో 29 చెరకు పరిశ్రమలకు కోటి 7 లక్షల 91 వేల 376 టన్నుల చెరకును తరలించగా, 8 లక్షల 77 వేల 357 టన్నుల చక్కెరను ఉత్పత్తి చేశారన్నారు. 2024–25లో 81 చెరుకు పరిశ్రమలకు 5 కోట్ల 40 లక్షల టన్నుల చెరకును సరఫరా చేయగా, దీని నుంచి 41 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయిందన్నారు.

సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు

డిమాండ్‌ తీర్చాలంటున్న చెరకు రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement