బెంగళూరు పాలికెల ఎన్నికలకు ఈసీ రెడీ | - | Sakshi
Sakshi News home page

బెంగళూరు పాలికెల ఎన్నికలకు ఈసీ రెడీ

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

దొడ్డబళ్లాపురం: చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తున్న గ్రేటర్‌ బెంగళూరులోని 5 నగర పాలికెల పరిధిలో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సమాయత్తమైంది. ఈ క్రమంలో వార్డులవారీగా ఓటర్ల లిస్టులను సిద్ధం చేయనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్‌ చివరికల్లా ఎన్నికలు జరపాలని యోచిస్తోంది. బెంగళూరులో సర్‌ వల్ల సుమారు 50 లక్షల ఓట్లు తొలగించిన నేపథ్యంలో ఎస్‌ఈసీ రెండోసారి వార్డులవారీగా ఓటర్ల లిస్టు రెడీ చేస్తోంది. ఇందుకోసం 142 మంది అధికారులను నియమించింది. వీరిలో 28 మంది ఈఆర్‌ఓలు,114 మంది ఏఈఆర్‌ఓలు. జాబితాల తయారీకి బట్టి ఎన్నికల తేదీ ఆధారపడి ఉంటుంది. ఓటర్ల లిస్టు ప్రకటించాక ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిశీలించి సవరణలు చేస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. తరువాత ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి, నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుడతారు.

బైక్‌ను ఢీ, కారులోని వ్యక్తి మృతి

చింతామణి: కారు బైకు డీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడక్కడే మరణించిన సంఘటన రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కడప బైపాస్‌ రోడ్డులో సోమవారం జరిగింది. వివరాలు... శివన్న (55) తాలూకాలోని హాదిగెరె వాస్తవ్యుడు. గ్రామానికి కారులో వెళుతుండగా ఎదురుగా వచ్చిన బైకు ఢీకొన్నాయి, కారులో ఉన్న శివన్న గాయాలతో పాటు గాభరా వల్ల అక్కడే చనిపోయాడు. కారులోని ఇద్దరికి, బైకిస్టుకు చిన్న గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

ఐటీ, ఈడీ దాడులకు

కేంద్రం కుట్ర: హోంమంత్రి

యశవంతపుర: తనపై, ఇతర మంత్రులపై ఐటీ, ఈడీతో దాడులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందని రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కేపీఎస్‌సీ ఉద్యోగాల అక్రమాల కేసును సాకుగా చూపి దాడులు చేయాలని కేంద్రం సిద్ధమైంది, ఢిల్లీ అధికార కారిడార్లలో ఇదే మాట్లాడుకొంటున్నట్లు తెలిసింది అని పేర్కొన్నారు.

కేపీఎస్‌సీ అక్రమాలలో కాంగ్రెస్‌తో పాటు తన పేరును చేర్చి ఈడీ ద్వారా ఒత్తిడి పెంచాలనుకుంటున్నారని రాశారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చేతులు కలిపిన వ్యక్తి దీని వెనుక ఉన్నారన్నారు. కఠినంగా పనిచేస్తానని చెప్పుకొనే కేంద్రమంత్రి రాజకీయంగా మునిగిపోవడంతో పాటు ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీని కూడా నాశనం చేయడానికి సిద్ధమయ్యారని పరోక్షంగా కేంద్రమంత్రి హెచ్‌డి కుమారస్వామిపై మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement