సౌజన్య కేసులో తల్లి విచారణ | - | Sakshi
Sakshi News home page

సౌజన్య కేసులో తల్లి విచారణ

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి పీయూసీ విద్యార్థిని సౌజన్య అత్యాచారం, హత్య కేసులో సిట్‌ కొత్త చీఫ్‌ చేతన్‌సింగ్‌ రాథోడ్‌ సోమవారం మంగళూరు సిట్‌ ఆఫీసుకు చేరుకున్నారు. సిటీ పోలీసు కమీషనర్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డితో ఆయన భేటీ అయి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొదట సౌజన్య తల్లితో పాటు కుటుంబసభ్యులను పిలిపించి మాట్లాడారు. సుధీర్‌కుమార్‌రెడ్డి, మరో పోలీసు అధికారిణి నిశా జేమ్స్‌ల సమక్షంలో సౌజన్య తల్లితో పాటు కుటుంబసభ్యులను విచారించారు. ఇక్కడి విచారణను గోప్యంగా ఉంచాలని వారికి సూచించారు.

పెండింగ్‌ బిల్లులు

మంజూరు చేయాలి

బనశంకరి: రూ.38 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఆర్‌.మంజునాథ్‌, సభ్యులు సోమవారం సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచి 1.5 లక్షల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నామని, ఆత్మహత్యలే శరణ్యమని చెప్పినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వెంటనే చెల్లిస్తామని గతంలో డీకే హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా పక్కన పెట్టారన్నారు. జూన్‌ నెలలో అప్పటి సీఎం సిద్దరామయ్యను కలవగా పెండింగ్‌ బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు, కానీ ఇప్పటికీ మంజూరు కాలేదని వాపోయారు.

భక్తిశ్రద్ధలతో ఆల్‌సోల్స్‌ డే

కోలారు : నగరంలో క్రైస్తవ సోదరులు ఆల్‌సోల్స్‌ డేను సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్మశానాలకు వెళ్లి పూర్వీకుల సమాధులను పూలతో అలంకరించి పూజలు చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement