సర్కారు, పోలీసుల కట్టుకథలు | - | Sakshi
Sakshi News home page

సర్కారు, పోలీసుల కట్టుకథలు

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

● కేంద్రమంత్రి కుమారస్వామి

స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం, బెంగళూరు నగర పోలీస్‌కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ పై కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ... మాజీ సీఎం సిద్దరామయ్యకు క్లీన్‌చిట్‌ ఇవ్వడానికి పోలీసులు తమపై కట్టుకథ అల్లడానికి సిద్ధయ్యారన్నారు. ఇది ట్రైలర్‌ మాత్రమే, సినిమా ఇంకా ఉందని హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే చెప్పడంపై మండిపడ్డారు, తన వద్ద పూర్తి సినిమా ఉందని కుమారస్వామి అన్నారు. స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో తనపేరు చేర్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వీడియోలో చూపినట్లు లైంగికదాడి అనేది జరగలేదని పోలీసులు గత నెల 29న ప్రకటించారు, ఫోరెన్సిక్‌ నివేదిక రాకముందే ఘటన జరగలేదని పోలీసులు తీర్మానించడం సిద్దరామయ్యకు రక్షించి ప్రభుత్వాన్ని కాపాడే కుట్ర కాదా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్‌ మాజీ అధ్యక్షురాలు కృపా ఆళ్వా పాత్ర ఏమిటి?, కేరళ ఆడపిల్ల గతంలో ఈ–మెయిల్‌ చేసిన ఫిర్యాదులు ఎక్కడికి వెళ్లాయి, ఆ బాలికకు ఎంత డబ్బు ఇచ్చారు, స్టింగ్‌ వీడియోలో ఉన్న మూడో వ్యక్తి ఎవరు, అతని పాత్ర ఏమిటి , కృపా ఆళ్వాను విదేశాలకు ఎందుకు పంపించారు.. ఈ కోణంలో పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు అని ప్రశ్నించారు. 2011 వీడియో 2023లో బయటకు రావడానికి కారణం ఏమిటి అన్నారు. రితేశ్‌పాండే అనే వ్యక్తిని యూపీ ఘజియాబాద్‌లో అరెస్టు చేసి, తన ఇంట్లో చేశామని హోంమంత్రి , కమిషనర్‌ కట్టుకథ సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement