క్రీడల్లో గెలుపోటములు సహజం | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో గెలుపోటములు సహజం

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

రాయచూరు రూరల్‌: క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని గురుమిఠకల్‌ ఎమ్మెల్యే శరణే గౌడ కందకూర్‌ క్రీడాకారులకు సూచించారు. ఆదివారం రాయచూరు తాలూకా దేవసుగూరులో జయ కర్ణాటక సేన ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడల ద్వారా మానసికంగా, శారీరకంగా, దైహికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణం

రాయచూరు రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా ముక్కనాళ గ్రామానికి చెందిన శివరాజ్‌ (40) ఈ ప్రమాదంలో మృతి చెందాడు. సిరవార నుంచి దేవదుర్గకు ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శివరాజ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని వెనుక కూర్చున్న ముదుకప్ప తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. దేవదుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆధునిక సాంకేతికతతో మెరుగైన సేవలు

హొసపేటె: నాణ్యత, విశ్వసనీయత, నూతన సాంకేతికతతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం లభిస్తాయని కొప్పళ గవిమఠం అభినవ గవిసిద్దేశ్వర మహాస్వామి అన్నారు. ఆదివారం హొసపేటెలో వికాస సౌహర్ధ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ కేంద్ర కార్యాలయంలో దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ ఆటో వాల్ట్‌ లాకర్‌ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయట సంపద, మనసులో సంతోషం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న వికాస బ్యాంక్‌ను అభినందించారు. కార్యక్రమంలో కొట్టూరు స్వామి మఠం బసవలింగ మహాస్వామిజీ, గోద్రెజ్‌ సంస్థ ప్రతినిధి పర్సీ మాస్టర్‌, బ్యాంక్‌ అధ్యక్షుడు విశ్వనాథ్‌ హిరేమఠ్‌్‌, ఎండీ ప్రసన్న హిరేమఠ్‌్‌, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

విద్యతోనే గౌరవమైన జీవనం

బళ్లారి టౌన్‌: విద్యతోనే గౌరవమైన జీవనం సాధ్యమని కమ్మరిచేడు కళ్యాణ స్వామి పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని సంగనకల్లు గ్రామంలో దాదాపు 500 మంది దాక విద్యార్థులతో పాటు సాధకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితులు, కష్ట నష్టాలను ఎదురించి సాధకులుగా మారిన వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. సంగనకల్లు గ్రామం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని తెలిపారు. వైద్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులుగా ఎదిగారన్నారు.

ఎన్‌ఆర్‌బీసీకి

నీరు విడుదల చేయాలి

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక జిల్లాలోని రాయచూరు, లింగసూగురు, దేవదుర్గ, యాదగరి జిల్లాలోని సురుపుర తాలుకాల్లోని నారాయణపుర కుడి కాలువలకు నిరంతరం నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి రాజు గౌడ డిమాండ్‌ చేశారు. ఆదివారం యాదగిరిలో జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్‌ఆర్‌బీసీకి వార బంది పద్ధతికి స్వస్తి పలికి నిరంతరం నీటిని విడుదల చేయాలని సూచించారు. కాలువ పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు నీరందడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement