హొసపేటె: కన్నడ భూమి, భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కేఎస్.బసవంతప్ప పిలుపునిచ్చారు. నగరంలోని డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ జిల్లా క్రీడామైదానంలో ఆదివారం నిర్వహించిన 71వ కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ కన్నడ భాష, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళలు, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన 14 మందికి జిల్లా రాజ్యోత్సవ పురస్కారాలను అందజేశారు. పోలీసు బలగాలు, విద్యార్థుల కవాతు ఆకట్టుకోగా, కన్నడ పాటలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హెచ్‌ఆర్. గవియప్ప, జిల్లా కలెక్టర్ కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ సీఈఓ గరిమా పన్వార్, ఎస్పీ జాహ్నవి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం
బళ్లారి అర్బన్: నగరంలోని 23వ వార్డు తాలూరు రోడ్డులోని మహానంది కోట్టం ఫస్ట్ క్రాస్ సర్కిల్‌లో శ్రీ పట్టాభిరామ సేవా ట్రస్ట్, అంబేడ్కర్ సేవా సమితి కర్ణాటక సంయుక్త ఆధ్వర్యంలో 71వ కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి, కార్పొరేటర్ మోత్కూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో గురుపదప్ప, ఉపాధ్యక్షుడు నాగరాజ్ కే., ప్రధాన కార్యదర్శి శాంతప్ప, సంయుక్త కార్యదర్శి కే.వీరేష్ కుమార్, కోశాధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
మంత్రి బసవంతప్ప


