రాయచూరు రూరల్: సమాజంలో మానవాళికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ సూచించారు. శనివారం సాయంత్రం కలబుర్గిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సింగ్ పట్టాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. వైద్య రంగంలో నర్సులు ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆటోస్టాండ్ల
తొలగింపు సరికాదు
సాక్షి, బళ్లారి: నగరంలో అనుమతులు ఉన్న ఆటోస్టాండ్లను అకస్మాత్తుగా సరికాదని ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హుండేకర్ రాజేష్ మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో ఆటోస్టాండ్ల వద్ద కన్నడ జెండాలు కట్టి ఘనంగా కర్ణాటక రాజ్యోత్సవాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. శనివారం రాత్రి కార్పొరేషన్ సిబ్బంది, పోలీసులు ఉన్నపళంగా ఆటో స్టాండ్లు తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 2001లో జిల్లా అధికారి నుంచి అన్ని అనుమతులు తీసుకుని నగరంలోని పలు చోట్లు ఆటోస్టాండ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఆటోస్టాండ్లను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.


