గ్రామానుభవ కార్యక్రమానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

గ్రామానుభవ కార్యక్రమానికి శ్రీకారం

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

హొసపేటె: పట్టణ విద్యార్థులకు పల్లె జీవన విధానం, వ్యవసాయం, ఉద్యానవనం పాడిపరిశ్రమతో పాటు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రత్యక్షంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ‘గ్రామానుభవ’ కార్యక్రమం విజయనగర జిల్లాలో ప్రారంభమైంది. ఆదివారం హొసపేటలోని డాక్టర్‌ పునీత్‌రాజ్‌ కుమార్‌ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కేఎస్‌ బసవంతప్ప, ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌.గవియప్ప హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల జీవనశైలి, రైతుల కష్టాలు, వ్యవసాయ పద్ధతులు, పశుపోషణ, గ్రామీణ సంస్కృతిపై ప్రత్యక్ష అవగాహన పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కవిత ఎస్‌ మన్నికేరి, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గరిమా పన్వార్‌, జిల్లా ఎస్పీ ఎస్‌.జాహ్నవి, పాఠశాల విద్యాశాఖ ఉప సంచాలకుడు వెంకటేష్‌ రామచంద్రప్ప, ప్రీ–యూనివర్సిటీ విద్యాశాఖ ఉప సంచాలకుడు నాగరాజ్‌ హవల్దార్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement