నెత్తురోడిన రోడ్లు.. నలుగురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రోడ్లు.. నలుగురు దుర్మరణం

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలో శుక్రవారం సాయంత్రం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలైన ఘటనలు రాయచూరు, యాదగిరి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. రాయచూరు జిల్లా ిదేవదుర్గ తాలూకా గలగ జెస్కాం అధికారి మల్లికార్జున (40) నీలగల్‌ వద్ద జరిగిన దుర్ఘటనలో మృతి చెందాడు. గలగ నుంచి సిరవార మీదుగా రాయచూరుకు ద్విచక్రవాహనంపై వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో మల్లికార్జున మరణించగా, అతనితో పాటు బైక్‌పై కూర్చున్న కుమార్తెలు ఉషా(9), విస్మయ(11)లను చికిత్సల నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై సిరవార పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యాదగిరి జిల్లాలో ముగ్గురు..

యాదగిరి జిల్లా గురుమఠకల్‌ తాలూకా సైదాపూర్‌ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పల్సర్‌ బైక్‌లో కణేకల్‌ నుంచి సైదాపూర్‌కు వెళుతున్న సమయంలో యాదగిరి నుంచి రాయచూరుకు వస్తున్న ఫార్చునర్‌ కారు ఢీకొనడంతో సైదాపూర్‌కు చెందిన తల్లి బసలింగమ్మ(60), ఆమె కుమారుడు తిమ్మణ్ణ(30), కోడలు నాగమ్మ(28) మరణించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్‌ పోలీసులు తెలిపారు.

వేర్వేరు జిల్లాల్లో రెండు రోడ్డు ప్రమాదాలు

మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement