భారతరత్న మదర్‌ థెరిసా అవార్డు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

భారతరత్న మదర్‌ థెరిసా అవార్డు ప్రదానం

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

బళ్లారిఅర్బన్‌: సామాజిక సేవ, కళా రంగాల్లో విశేష కృషి చేసినందుకు శ్రీ వాల్మీకి మహిళా సంస్థ అధ్యక్షురాలు అనురాధకు ప్రతిష్టాత్మక భారతరత్న మదర్‌ థెరిసా అవార్డు– 2026ను ప్రదానం చేశారు. టీవీ 4 కన్నడ న్యూస్‌ ఛానల్‌, శ్రీ షిర్డీ సాయి దీపా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్‌ 29న బెంగళూరులోని యలహంకలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. నిర్వాహకులు అనురాధను శాలువా, మైసూరు పేటాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికతో పాటు అవార్డు ఫలకాన్ని అందజేశారు. కార్యక్రమానికి టీవీ 4 కన్నడ న్యూస్‌ ఛానల్‌ అధిపతి డాక్టర్‌ సాయి సతీష్‌ తోటయ్య, కర్ణాటక నాటక అకాడమీ అవార్డు గ్రహీత సుజాత శాస్త్రి హిరేమఠ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాల్మీకి మహిళా కళా సంస్థ ద్వారా అనురాధ మహిళా సాధికారత, జానపద కళల పరిరక్షణ, సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల మహిళా కళాకారిణులకు అవకాశాలు కల్పిస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పురస్కారం స్వీకరించిన అనురాధ మాట్లాడుతూ ఈ అవార్డు తన ఒక్కరికే కాకుండా సంస్థలోని కళాకారులందరికీ దక్కిన గౌరవమని అన్నారు. భవిష్యత్తులో మహిళా సాధికారత, కళా సాంస్కృతిక రంగాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. పలువురు ప్రముఖులు, కళాకారులు, సామాజిక సేవకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement