రాయచూరు రూరల్: కొప్పళలో భారీ పరిశ్రమల ఏర్పాటు తగదని కొప్పళ జిల్లా బచావో ఆందోళన సమితి, పరిసరాల సమితి హితరక్షణ సమితి అధ్యక్షుడు అగ్ని దివ్యా పేర్కొన్నారు. శనివారం కొప్పళలో బంద్ నిర్వహించి ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మానవుల జీవితాలను అనారోగ్యం పాలు చేయడం తగదన్నారు. బల్డోటా, కిర్లోస్కర్, కళ్యాణ్ స్టీల్, ముక్కుంద సుమి, ఎక్సో ఇండియా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలం కలుషితం కావడంపై మానవుడి ఆయుష్షు క్షీణించడంతో పాటు వాటి బారిన పడి వినాశనానికి దారి తీసే పరిశ్రమల ఏర్పాటుకు ససేమిరా అంగీకరించకుండా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. నగరంలో ఉదయం నుంచి స్వచ్ఛందంగా దుకాణాలు, కళాశాలలు, విద్యా సంస్థల బంద్‌కు పూర్తి స్థాయి మద్దతు లభించింది.


