హొసపేటె: విద్యారంగంలో మరో కీలక మైలురాయికి హొసపేటె వేదికై ంది. బళ్లారికి చెందిన వీరశైవ విద్యావర్ధక సంఘం ఆధ్వర్యంలో హొసపేటలోని ప్రౌఢదేవరాయ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీరశైవ విద్యావర్ధక సంఘం న్యాయ విద్యా కళాశాలను ప్రారంభమైంది. హంపీ హేమకూట పీఠాధిపతి జగద్గురు కొట్టూరు బసవలింగ స్వామీజీ, సండూరు సంస్థాన విరక్తమఠం ప్రభు మహాస్వామీజీల దివ్య సాన్నిధ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బెంగళూరుకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి అరళి న్యాయ విద్యా కళాశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ రత్నా ఆర్.భరమగౌడర్, వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు డాక్టర్ కణేకల్ మహాంతేష్ తదితరులు పాల్గొన్నారు.


