రూ.80 కోట్ల ప్రభుత్వ స్థలం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.80 కోట్ల ప్రభుత్వ స్థలం స్వాధీనం

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

మైసూరు: మైసూరు అభివృద్ధి ప్రాధికారకు చెందిన స్థలాల్లో అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలను అధికారులు నేలమట్టం చేసి సుమారు రూ.80 కోట్ల విలువైన భూమిని స్వాధీనపరచుకున్నారు. మైసూరులోని విజయనగర నాలుగో స్టేజీ 2వ ఫేజ్‌లో 5.14 ఎకరాలను కొందరు ఆక్రమించి కట్టడాలను నిర్మించారు. దీంతో అధికారులు కట్టడాలను నేలమట్టం చేయించారు. మైసూరు తాలూకా బసవనహళ్లి గ్రామ సర్వే నంబర్‌–118లోని భూమి కబ్జాకు గురవ్వగా అధికారులు కోర్టులో కేసు వేశారు. అది ప్రాధికార భూమిగా నిర్ధారించిన తర్వాత రెండు నెలల క్రితం ఆక్రమణలను ఖాళీ చేయాలని అక్కడి నివాసులకు నోటీసులు అందించారు. అయినా ఖాళీ చేయక పోవడంతో ఎండీఏ కమిషనర్‌ బీఆర్‌ మహేష్‌ సూచనల మేరకు సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ కేఆర్‌ మహేష్‌ విజయనగర పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ లవ, సిబ్బంది సహకారంతో కూల్చివేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement