మండ్య: ‘రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం లీటరు పాల ధరను రూ.7 పెంచాలని నిర్ణయిస్తే, దీనిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది వారు రైతు పక్షపాతులు కాదని చూపిస్తోందని’ ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ విమర్శించారు. శనివారం మండ్యలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు, కొత్తవాటికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పశుగ్రాసం, మందుల ధరలు పెరగడంతో పాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఊరటనిచ్చేందుకే పాల ధరను పెంచామని అన్నారు. దీనిని కూడా బీజేపీ, జేడీఎస్ విమర్శించడం సరికాదని అన్నారు.
రైతుల భూములకు రక్షణ
రైతుల భూముల పరిరక్షణకు భూమి యోజన ద్వారా 6వ గ్యారంటీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం డీకే తెలిపారు. పోడీ, ఈ–ఆస్తులు, ఈ–ఖాతాలు వంటి పత్రాలను సిద్ధం చేసి, రైతుల భూములను పరిరక్షించి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు. చెరకు రైతులకు ప్రభుత్వం నుంచి టన్నుకు రూ.50, చక్కెర కర్మాగారాల నుంచి రూ.150 చొప్పున అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర కేజీ ధరను రూ.50గా నిర్ణయిస్తే, రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
హృద్రోగ ఆస్పత్రి కట్టిస్తాం
జిల్లాలో జయదేవ కార్డియాలజీ ఆసుపత్రి 100 పడకల ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. మళవళ్లి, మద్దూరుతో సహా చివరి రైతుల భూములకు కేఆర్‌ఎస్ డ్యాం నుంచి నీరందిస్తామని తెలిపారు. మండ్య వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్ల గ్రాంటు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మండ్య మిల్క్ యూనియన్ ప్రతిరోజూ 1.5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోంది. పాల వృథా నివారణకు నందిని ఐస్ క్రీమ్ యూనిట్‌ను ఏర్పాటుకు అనుమతి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. సభలో మంత్రులు ఎన్.చలువరాయస్వామి, పి.ఎం.నరేంద్రస్వామి, రుద్రప్ప లామాని, ఎమ్మెల్యేలు పి. రవికుమార్, కె.ఎం.ఉదయ్, రమేష్ బండిసిద్ద గౌడ, దర్శన్ పుట్టన్నయ్య, జిల్లాధికారులు పాల్గొన్నారు.
వివాదమైన ప్రభుత్వ
పాల ధర పెంపు
రైతులకు మేలు చేయనివ్వరా?
ప్రతిపక్షాలపై సీఎం డీకే ధ్వజం
మండ్యలో పర్యటన
మేకెదాటుకు
సుప్రీం ఆమోదం
కావేరి నదిపై మేకెదాటు ప్రాజెక్ట్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని, మన నీటి హక్కులను కాపాడుకుంటామని సీఎం తెలిపారు. మేకెదాటు ప్రాజెక్టును నిర్మిస్తే మండ్య, మైసూరు, హాసన్, పాత మైసూరు ప్రాంతాలలో కష్టకాలంలో ఉపయోగానికి 66 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. కరువు కాలంలో రైతులకు అండగా ఉన్నట్లు చెప్పారు. వేలాది కోట్ల రూపాయల వ్యయంతో గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.


