మరోసారి చెరకు రైతుల నిరసన జ్వాల | - | Sakshi
Sakshi News home page

మరోసారి చెరకు రైతుల నిరసన జ్వాల

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

శివాజీనగర: టన్ను చెరకుకు రూ.5,500 మద్దతు ధర ఇవ్వడంతో పాటు పాటు పలు డిమాండ్ల సాధనకు రైతులు శనివారం పిలుపునిచ్చిన రోడ్ల దిగ్బంధం కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పలుచోట్ల పోలీసులు నిషేధాజ్ఞలు విధించినా అన్నదాతలు ఆందోళనలు కొనసాగించారు. బెళగావి జిల్లాలో చిక్కోడి, అథణి తాలూకాల్లో హైవేలు, నగర రహదారులను రైతులు దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వేలాదిగా రైతులు తరలివచ్చారు. ఉత్తర కర్ణాటక అంతటా రహదారుల బంద్‌ పూర్తి స్థాయిలో జరిగింది. దక్షిణ కర్ణాటకలో అంతంతమాత్రంగా స్పందన లభించింది. బెళగావిలో చిక్కోడి, గోకాక్‌, హుక్కేరి, అలాగే బాగల్‌కోట, ధారవాడ, హావేరి ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.

డిమాండ్ల సాధనకు ఆందోళనలు

ఉత్తర కర్ణాటకలో విశేష స్పందన

హైవేలు, నగర రహదారుల్లో రాళ్లు,

ముళ్ల కంపలు

పలుచోట్ల నిషేధాజ్ఞల జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement