కావేరి తీరాన అక్రమ బోటింగ్‌ దందా | - | Sakshi
Sakshi News home page

కావేరి తీరాన అక్రమ బోటింగ్‌ దందా

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

మండ్య: ఏ శాఖ అనుమతి లేకుండా కావేరి నదిలో జరుగుతున్న అక్రమ పడవ ప్రయాణాలు ప్రజలు, పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. శ్రీరంగపట్టణం తాలూకా, జిల్లా యంత్రాంగాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. శ్రీరంగపట్నం వద్ద గంజాలోని శ్రీనిమిషాంబ ఆలయం ముందు నుంచి తెప్పల్లో ప్రజలను అటు ఇటు తరలిస్తున్నారు. వాటిలో ఎలాంటి సురక్షిత పరికరాలు లేవు. పలుకుబడి ఉన్న వ్యక్తులు అక్రమంగా కావేరి నదిలోకి జేసీబీ యంత్రాలను దించి, నదికి అడ్డంగా తాత్కాలిక మట్టి కట్టను నిర్మించి, నదీ జలాల ప్రవాహ దిశను మార్చడం ద్వారా నది సహజ స్వరూపాన్ని నాశనం చేశారు. దీనివల్ల నిమిషాంబ ఆలయం ముందు నదిలో లోతు పెరిగి, బోటింగ్‌కు అనువుగా మారిందని తెలుస్తోంది. పడవ విహారం పేరుతో ప్రజలు, పర్యాటకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఫిర్యాదు చేశా: అధికారి

మున్సిపల్‌ అధికారి రాజన్న మాట్లాడుతూ దేవాలయం ముందు కావేరి నదిలో అక్రమంగా బోటింగ్‌ నిర్వహిస్తున్నారన్నది నిజమే. పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు చెప్పారు. పునరావతమైతే, తెప్పలను జప్తు చేస్తామన్నారు.

ప్రమాదాలకు ఆస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement