బాలున్ని చంపిన వీధికుక్కలు | - | Sakshi
Sakshi News home page

బాలున్ని చంపిన వీధికుక్కలు

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

దొడ్డబళ్లాపురం: హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే సొంత జిల్లాలో విషాదం సంభవించింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన కలబుర్గి నగరంలోని జీడీఏ కాలనీలో జరిగింది. స్థానిక నివాసి శరణబసప్ప కుమారుడు మనోజ్‌ (4) మృతుడు. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా వీధికుక్కలు ఒక్కసారిగా అతనిపై దాడిచేసి తీవ్రంగా కరిచాయి. రక్తగాయాలతో ఉన్న మనోజ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.

పొట్టకూటికి వస్తే..

కలబుర్గి తాలూకా జంబగా గ్రామానికి చెందిన శరణబసప్ప దంపతులు పొట్టకూటికోసం నగరానికి వలస వచ్చారు. శరణబసప్ప సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా భార్య కూలి పని చేస్తోంది. చిన్నారిని కుక్కలు కబళించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నగరంలో కుక్కల సమస్య ఉన్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని, తరచూ కుక్కల దాడులు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు.

కలబుర్గి నగరంలో ఘోరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement