మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని కార్తీక (ఫైల్)
శివాజీనగర: బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 70 శాతం మేర పెరగడంతో బెంగళూరు నేడు ప్రమాదాల నగరంగా మారింది. 2021లో 3,213 ప్రమాదాలు జరగ్గా, 2025 నాటికి ఈ సంఖ్య 5,459కి చేరుకుంది. ఇదే కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల సంఖ్య కూడా సుమారు 53 శాతం మేర పెరిగింది. మద్యం తాగి వాహనం నడపడం, హెడ్‌లైట్లు లేకుండా ప్రయాణించడం, అతివేగం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడటం, సిగ్నల్ ఉల్లంఘనలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు ఏఐ కెమెరాలను ఉపయోగిస్తున్నప్పటికీ, రోడ్డు ప్రమాదాల కేసులు పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉంది.
రాజధానిలో 4,702 ప్రమాదాలు
2026లో గత జనవరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉన్న గణాంకాల ప్రకారం బెంగళూరులో 4,702 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 808 ప్రమాదాలు ప్రాణ నష్టం కలిగించాయి. మొత్తం 836 మంది మరణించగా, 4,111 మంది గాయపడ్డారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, ప్రమాదాలు, మరణాల సంఖ్య రెండింటిలోనూ పెరుగుదల కనిపిస్తోంది. అతివేగం, ప్రమాదకరంగా లేన్లు మార్చడం, తప్పుడు దిశలో వాహనాలు నడపడం, ద్విచక్ర వాహనాలతో జరిగే ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణాలు. బెంగళూరుకు విస్తృతమైన రహదారి వ్యవస్థ, మోటార్ సైకిళ్ల అధిక వినియోగం, శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య పెరగడం వంటివి కూడా ప్రమాదాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అభివృద్ధి, వేగంగా వెళ్లే వాహనాలు, పాదచారులను ఢీకొనడం వంటివి కూడా ప్రమాదాలకు దోహదపడుతున్నాయని కర్ణాటక పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.ఏ.సలీం అన్నారు.
పరిధి విస్తరణ కూడా కారణమే
2025, 2026 సంవత్సరాల్లో ప్రమాదాల సంఖ్య పెరగడానికి బెంగళూరు నగర పోలీస్ అధికార పరిఽధి విస్తరణ కూడా పాక్షికంగా కారణం కావచ్చు. గతంలో బెంగళూరు గ్రామీణ పోలీసుల అధికార పరిధిలో ఉన్న హెబ్బగోడి, కుంబళగోడు, ఆవలహళ్లి, రాజానుకుంటె, మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ల పరిఽధిని బెంగళూరు నగర పోలీసు పరిఽధిలోకి చేర్చారు. నిమ్హాన్స్ , జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గాయాల పరిశోధన విభాగం, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఈ అధ్యయనంలో నగరంలోని 25 ప్రదేశాల్లో వాహనాల వేగాన్ని పర్యవేక్షించారు. ఈ అధ్యయనంలో గమనించిన వాహనాల్లో 306 శాతం వాహనాలు నిర్దేశించిన సురక్షిత వేగ పరిమితిని మించి ప్రయాణిస్తున్నాయని ఆయన తెలిపారు. జాతీయ రహదారులపై, గ్రామీణ ప్రాంతాల్లో, అర్ధరాత్రి, తెల్లవారుజామున వాహనాల వేగం పెరుగుతోందని అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు.
అతివేగం, తప్పుడు మార్గంలో
వాహన చోదన
ఐదేళ్లలో 70 శాతం మేర రోడ్డు ప్రమాదాల వృద్ధి
కర్ణాటక పోలీస్ డైరెక్టర్ జనరల్
ఎం.ఏ.సలీం
రోడ్డు ప్రమాద ప్రధాన హాట్‌స్పాట్లు
8వ మైలు జంక్షన్ నుంచి నవయుగ టోల్, తుమకూరు రోడ్డు, కన్నమంగళ పాళ్య గేట్, బళ్లారి రోడ్డు, జక్కూరు ఫ్‌లైఓవర్, బళ్లారి రోడ్డు, మీనకుంటె హోసూరు, నాయండహళ్లి జంక్షన్ నుంచి బజాజ్ షోరూమ్ పంటరపాళ్య జంక్షన్, హుణసమారనహళ్లి, సాదహళ్లి గేట్, వీరసంద్ర జంక్షన్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆవలహళ్లి, టయోటా షోరూం ఎదురుగా, రెన్యూవబుల్ ఎనర్జీ ఆఫీస్ దగ్గర, నాగరబావి రింగ్ రోడ్డు
డ్రైవింగ్ లైసెన్స్
సస్పెండ్ చేస్తాం
డ్రంకన్ డ్రైవింగ్, హెడ్‌లైట్లు లేకుండా వాహనాలు నడపడం, అతివేగం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడటం, సిగ్నల్ ఉల్లంఘనలపై పోలీసులు ఇటీవల చర్యలను ముమ్మరం చేశారు. ఫుట్‌పాత్‌లపై వాహనాలను అక్రమంగా నిలిపేవారిపై కూడా చర్యలు తీసుకుంటాం.
–ఎం.ఏ.సలీం, పోలీస్ డైరెక్టర్ జనరల్


