● కాలి బూడిదైన గృహోపకరణాలు
● లక్షల రూపాయల ఆస్తి నష్టం
తుమకూరు: టీవీలు, మొబైళ్లు, వాషింగ్ మెషీన్ల సహా ఇతర గృహోపకరణాలు విక్రయించే దుకాణం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన తుమకూరు తాలూకా గులూరు హోబ్లీ, హొన్నూడికేలో గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మంజనాథ్ గృహోపకరణాల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దీంతో మొబైల్ ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, వాటి అనుబంధ వస్తువులు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. పక్క దుకాణాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించారు, తద్వారా మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంలో లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. హెబ్బూరు పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


