ఆర్థికసాయం అందజేత | - | Sakshi
Sakshi News home page

ఆర్థికసాయం అందజేత

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

రాయచూరు రూరల్‌: నగరంలోని లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి కాలనీలో హత్యకు గురైన నరసింహులు కుటుంబాన్ని శుక్రవారం కొప్పళ జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు పరామర్శించారు. అధైర్యపడవద్దని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సంఘం తరఫున కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ఆనంద శిరహట్టి, రాఘవేంద్ర, సావిత్ర పురుషోత్తమ్‌, పలుగుల నాగరాజ్‌, శ్రీనివాస్‌, సోమనాథ్‌, నాగభూషణ్‌, లక్ష్మణ, గంగ తదితరులు పాల్గొన్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళి

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలుకాలోని మమాదాపూర్‌లో గురువారం రాత్రి సినీ నటుడు డాక్టర్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ వర్ధంతి నిర్వహించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో యరగేర ఎస్‌ఐ ప్రకాష్‌ డంబళ్‌ తదితరులు పునీత్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి పేదలకు సేవలందిచారని కొనియాడారు. నిత్యం పేదల కోసం నిత్యం పరితపించారని తెలిపారు. పునీత్‌ను యువకులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో రేణుక, రూప తదితరులు పాల్గొన్నారు.

హోటల్‌ యజమానిపై

చర్యలు తీసుకోండి

రాయచూరు రూరల్‌: లింగసూగూరు తాలూకా నాగరాళ గ్రామంలో ఒక హోటల్‌లో ఎస్సీ కులానికి చెందిన శివానంద అనే వ్యక్తికి గ్లాసుతో నేరుగా చేతిలోకి నీరు పోసి తాగించడం ద్వారా కులాంతర వివక్ష (అస్పృశ్యత) చూపారని దళిత సంఘర్ష సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు హోటల్‌ యజమానిపై కేసు నమోదు చేయాలని ఆ సమితి సంచాలకుడు అమరేష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సింధనూర్‌లోని గాందీ సర్కిల్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి అజయ్‌ సింగ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

వివిధ రంగాల్లో

సాధకులకు రేపు సన్మానం

బళ్లారి టౌన్‌: కర్ణాటక రాజ్యోత్సవాన్ని పురస్కరించుకుని తాలూకాలోని సంగనకల్లు పంచాయతీ కార్యాలయ ఆవరణలో నవంబర్‌ 1వ తేదీన వివిధ రంగాల్లో 500 మంది సాధకులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్‌ ఇంజనీర్‌ వెంకటరమణ, సంగనకల్లు హేమంత్‌ రాజ్‌ తెలిపారు. శుక్రవారం నగరంలోని పత్రికా భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. 200 మంది సీనియర్‌ సిటిజన్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, లాయర్లు, వైద్యులు, పట్టుభద్రలకు సేవారత్న అవార్డులు, 200 మంది ప్రతిభావంత విద్యార్థులకు రైజింగ్‌ స్టార్‌, 200 మంది రిటైర్డ్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ హీరో అవార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనస్తామని వివరించారు. సమావేశంలో స్థానిక నేతలు కృష్ణప్ప, కట్టేగౌడ, మేటి బవసరాజుగౌడ, సీనియర్‌ లాయర్‌ దాసరి గోవింద, ప్రసాద్‌, యుదీష్టర, గణేష్‌, నాగరాజు, బాష, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల స్థలాలు కేటాయించాలి

హొసపేటె: విజయనగర జిల్లాలోని భూమిలేని పేదలకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని గ్రామీణ కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్లాట్ల కేటాయింపులో జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని సూచించారు. అనంతరం జెడ్పీ సీఈఓ గరిమా పన్వార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ మల్లేష్‌ కోగలి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement