నగరాభివృద్ధిలో అధికారులు విఫలం | - | Sakshi
Sakshi News home page

నగరాభివృద్ధిలో అధికారులు విఫలం

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

రాయచూరు రూరల్‌: రాయచూరు నగర సభను కార్పొరేషన్‌గా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. కేవలం పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారని ఏఐఎంఎం సంచాలకుడు శబ్బీర్‌ ఆహ్మద్‌ ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో రహదారులు అధ్వాన్నంగా మారాయన్నారు. మురుగు కాలువలను శుభ్రం చేయించడం లేదన్నారు. స్వచ్ఛతను కాపాడటంలో విఫలమయ్యారని తెలిపారు. నగర సభలో సిబ్బంది కొరత ఉందని.. వెంటనే నియమించాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

ఉపాధ్యాయ సమస్యల

పరిష్కారానికి కృషి

రాయచూరు రూరల్‌: ఈశాన్య ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విధాన పరిషత్‌ సభ్యుడు శశీల్‌ నమోషి హామీ ఇచ్చారు. ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించడంతో శుక్రవారం కలబుర్గిలోని హెచ్‌కేఈ కళాశాలలో విధాన పరిషత్‌ సభ్యుడు శశీల్‌ నమోషిని ఘనంగా సన్మానించారు. నూతన పెన్షన్‌ విధానానికి బదులుగా పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు.

దేవదుర్గ తాలూకాలో సామూహిక వివాహాలు

రాయచూరు రూరల్‌: ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకునేందుకు కృషి చేయాలని రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌ పిలుపునిచ్చారు. దేవదుర్గ తాలూకా జాళహళ్లి లక్ష్మీ రంగనాథ దేవస్థానంలో శుక్రవారం ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోజూ కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా జీవితంలో ప్రశాంతతను పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాశీ జగద్గురువులు, జయశాంత శివాచార్యులు పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలుకా ఆరోగ్య అధికారిగా (టీహెచ్‌ఓ) లక్ష్మీకాంత్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న తాలూకా ఆరోగ్య అధికారి సతీష్‌.. జిల్లాలోని మటమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయ్యారు. శుక్రవారం తాలుకా ఆరోగ్య అధికారి కార్యాలయంలో సతీష్‌ నుంచి లక్ష్మీకాంత్‌ బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా స్థాయి

యువజనోత్సవాలు ప్రారంభం

రాయచూరు రూరల్‌: నేటి యువత విదేశీ సంస్కృతికి ఆకర్షితులు కాకుండా దేశీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సాహితీవేత్త అయ్యప్ప హుడా సూచించారు. నగరంలోని వేదాంత కళాశాలలో జిల్లా పరిపాలన, జిల్లా పంచాయతీ, యువజన క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ప్రతి రంగంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. దేశభక్తి, మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకుని వాటిని ఆచరించాలని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శరణప్ప గోనాళ్లు, ప్రకాష్‌ నంది, అధికారి ఈరేశ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement