ఆయుర్వేదంతో రోగాలు దూరం | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేదంతో రోగాలు దూరం

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

సాక్షి బళ్లారి: అనంతపురం రోడ్డులోని తారానాథ ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రిని శుక్రవారం పలువురు కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రోగులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని ఆరా తీశారు. మౌలిక సదుపాయాలు, ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన తారానాథ ఆయుర్వేద ఆస్పత్రి బళ్లారిలో ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు. నయం కాని రోగాలను సైతం ఆయుర్వేదంతో మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుపరుస్తామని వెల్లడించారు.

ఉచితంగా తోపుడు బండ్ల వితరణ

బళ్లారి అర్బన్‌: వీధి వ్యాపారులకు ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అండగా నిలిచారు. గడిగి చెన్నప్ప సర్కిల్‌ నుంచి ఎడిగ హాస్టల్‌ వరకు రహదారి అభివృద్ధి పనులు చేపట్టిన సమయంలో స్థానిక వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు అందిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. శుక్రవారం గడిగి చెన్నప్ప సర్కిల్‌ సమీపంలో టచ్‌ ఫర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 9 మంది వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద వ్యాపారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేశామన్నారు. కార్పొరేషన్‌ సభ్యుడు నూర్‌ మహమ్మద్‌ మాట్లాడుతూ.. అద్దె తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఉచితంగా బండ్లు అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బీఏఆర్‌ శీనా, పోలక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement