హుబ్లీ: ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్న కార్తీక్ అనే యువకుడిపై గోకుల్ రోడ్డు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యువతి ఇంటికి వెళ్లిన కార్తీక్.. ప్రేమించకపోతే ప్రాణాలు తీస్తాను అని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
అదనపు కట్నం కోసం
వేధింపులు
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్తతో పాటు అత్త, ఆడపడుచుపై కేసు నమోదు చేసినట్లు డి.హీరేహాళ్ ఎస్‌ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు...బళ్లారి పట్టణానికి చెందిన తిరుమలమ్మకు 17 ఏళ్ల క్రితం డి.హీరేహాళ్ మండలంలోని మురడి గ్రామానికి చెందిన గోవిందుతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త గోవిందు, అత్త తిప్పమ్మ, ఆడపడుచు ఆంజినమ్మ వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇళ్ల నిర్మాణాలకు
నిధుల మంజూరుపై హర్షం
రాయచూరు రూరల్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ ద్వారా మురికివాడల ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మురికివాడల వేదిక హర్షం వ్యక్తం చేసింది. వేదిక సంచాలకుడు జనార్దన్ మాటాడుతూ.. వీధి వ్యాపారులు, కుష్టు రోగులు, దివ్యాంగులు, సఫాయి కర్మచారులు, దేవదాసీ మహిళలు, వితంతువులు, నిరుపేదలు ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. అనిల్ కుమార్, చంద్రమ్మ, తేజస్ కుమార్, బసవరాజ్, మంజుబాయి, హన్మంతు, నాగరాజ్, నితీన్, పుష్ప, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.


