బళ్లారి అర్బన్: అంబేడ్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార తెలిపారు. శుక్రవారం నగరంలోని జిల్లా అధికారి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పత్రికా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమితి కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ మేరకు అమరపుర అశోక్ భీమారావు, జిల్లా ఉపాధ్యక్షుడిగా డి.శంకర్, గిరి శంకర్, నగర అధ్యక్షుడిగా మహానందిని నియమించడం జరిగిందన్నారు. రాజ్యాంగంపై అవగాహన, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులు సమన్వయంతో పని చేస్తూ క్షేత్రస్థాయిలో సమితిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ముత్తురాజ్, గిరి శంకర్, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


