హొసపేటె: హొసపేటె తాలూకాలో వడ్డరహళ్లి గ్రామం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వడ్డరహళ్లి సమీపంలోని రైల్వే వంతెన వద్ద రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీలో చిక్కుకుపోయిన మహరాష్ట్రకు చెందిన డ్రైవర్ మల్లికార్జున్ (46) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేసీబీ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
డ్రైవర్ అక్కడికక్కడే మృతి


