బనశంకరి: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర శికారిపాళ్యలో బంగ్లా వలసదారులు తిష్టవేశారని హిందూ సంఘాల కార్యకర్తలు అక్కడికి వెళ్లగా ఘర్షణ జరిగింది. వలసదారులు తమపై దాడి చేశారని హిందూ కార్యకర్తలు ఆరోపించారు. డాక్టర్ నాగేంద్రప్ప ,సంతోష్ కర్తాల్, అమిత్, పవన్ గాయపడటంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగేంద్రప్ప ఫిర్యాదు మేరకు హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే తమ షెడ్లలోకి చొరబడ్డారని హజిపుల్ షేక్, ఇతర వలసదారులు కూడా ఇదే ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
హులిమంగలలో ఇంయాజ్ అనే వ్యక్తికి చెందిన షెడ్లలో బంగ్లాదేశీయులు ఉన్నారని మంగళవారం సాయంత్రం హిందూ సంఘాల కార్యకర్తలు వెళ్లారు. మీ గుర్తింపు కార్డులు చూపాలని అడిగితే కూలీలు తిరస్కరించారు. పైగా తమ భాషలో దూషిస్తూ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి మండిపడ్డారు. కర్ణాటక అనేది అక్రమ వలసదారుల ధర్మసత్రం కాదని అన్నారు.
హెబ్బగోడిలో హిందూ కార్యకర్తల ఫిర్యాదు


