సౌజన్య కేసుకు ఐజీపీ గుడ్‌బై! | - | Sakshi
Sakshi News home page

సౌజన్య కేసుకు ఐజీపీ గుడ్‌బై!

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడికి చెందిన పీయూసీ విద్యార్థిని సౌజన్య అత్యాచారం, హత్య కేసు పునర్విచారణ సిట్‌ చీఫ్‌ స్థానం నుంచి తప్పించాలని ఐజీపీ శశికుమార్‌ డీజీపీ ఎంఎ సలీంకు లిఖిత పూర్వకంగా విన్నవించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ కేసును పునర్విచారణకు సిట్‌ను నియమించడం తెలిసిందే. అయితే సౌజన్య కుటుంబం, ప్రజలు శశికుమార్‌పై అనుమానంతో ఉన్నారు. ఆయన గతంలో మంగళూరు పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ధర్మస్థలతో పాటు జిల్లాలో పరిచయాలు ఉన్నాయని, కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయరని ప్రజాసంఘాలు ఆరోపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు సిట్‌ అధికారి లోకేశ్‌ జగలాసర్‌ ముందుకు మొదట్లో ఈ కేసును విచారించిన గత బెళ్తంగడి సీఐ భాస్కర్‌ రై, ఎస్‌ఐ యోగీశ్‌ కుమార్‌, సీఐడి డీఎస్పీ రుద్రముని వచ్చారు. అయితే 15 మంది పోలీసులకు నోటీసులు ఇస్తే ముగ్గురే రావడం గమనార్హం.

యతీంద్ర.. ఆ మాటలొద్దు

మైసూరు: అంబా విలాస్‌ ప్యాలెస్‌, ఆ భూమి ప్రభుత్వానిదని రాజకుటుంబాన్ని చులకనగా మాట్లాడిన జిల్లా మంత్రి యతీంద్ర క్షమాపణలు చెప్పాలని గురువారం నగరంలో పలు సంస్థలు నిరసన తెలిపాయి. కోటే ఆంజనేయస్వామి ఆలయం వద్ద ధర్నా చేశారు. చరిత్రను అవమానించవద్దు, రాజుల సేవలను గుర్తుంచుకుందాం అని ప్లకార్డులను ప్రదర్శించారు. యతీంద్ర ఫోటో పెట్టి ఎముక లేని నాలుక అని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement