గంజాయి సాగుదారు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి సాగుదారు అరెస్ట్‌

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

●రూ.11 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచిన కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం దేవదుర్గ తాలూకా జాలహళ్లి వద్ద కంది పొలంలో అక్రమంగా గంజాయిని పెంచారని ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు. తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొలంలో వేసిన కంది పంట ఏపుగా పెరగడంతో దానిలో గంజాయిని సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసు బృందం దాడి చేశారన్నారు. గంజాయిని సాగు చేసిన రైతు సాబణ్ణను అరెస్ట్‌ చేయడంతో పాటు సుమారు రూ.11 లక్షల విలువైన 23.89 కేజీల 51కు పైగా గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మాంజా దారానికి అడ్డుకట్ట వేయాలి

హుబ్లీ: గాలిపటాన్ని ఎగరవేయడానికి వాడుతున్న మాంజా దారానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, సంఘ సంస్థలు ఎంతో ప్రయత్నిస్తున్నారు. యమపాశంగా మారి ఇటీవల ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలిగొన్న మాంజా దారం ఎక్కడా కనిపించరాదని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో విక్రయాలకు బ్రేక్‌ పడాలని, ఇక ఆన్‌లైన్‌లో కూడా మాంజాదారం విక్రయాలు జరగకుండా అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు గత చేదు ఘటనలను వివరిస్తూ ఇటీవల ఓ యువకుడు అదృష్టం కొద్ది బతికి బట్టకట్టాడు కానీ మాంజా దారం అతడి ముక్కుపై తీవ్రంగా గాయం చేసింది. ఏదేమైనా మాంజా దారాన్ని అన్ని రకాలుగా అరికట్టాలని ముఖ్యంగా ఆన్‌లైన్‌లో విక్రయాలు జరగకుండా చూడాలని ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement