తత్వపద సాహిత్య పీఠం ఏర్పాటు చేయరూ | - | Sakshi
Sakshi News home page

తత్వపద సాహిత్య పీఠం ఏర్పాటు చేయరూ

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

రాయచూరు రూరల్‌: రాయచూరు వాల్మీకి మహర్షి విశ్వవిద్యాలయంలో తత్వ పద (గేయాలు) సాహిత్య పీఠం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కన్నడ సాహిత్య పరిషత్‌ డిమాండ్‌ చేసింది. గురువారం రాయచూరులో వాల్మీకి మహర్షి విశ్వవిద్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు రంగన్న పాటిల్‌ మాట్లాడారు. జిల్లాలో శరణులు, దాసులు, సంతులు, సూఫీలు, తత్వ పద, వాగ్గేయ కారుల గురించి భవిష్యత్తులో చర్చించుకోవడానికి తత్వ పద సాహిత్య పీఠం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ వాల్మీకి మహర్షి విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ శివానందకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement