కరువు విలయం.. వలస శరణ్యం | - | Sakshi
Sakshi News home page

కరువు విలయం.. వలస శరణ్యం

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

● ప్రయాణికులతో రాజధాని రైలు రద్దీ

● పట్టించుకోని క–క ప్రజాప్రతినిధులు

ప్రయాణికుల రద్దీతో యాదగిరి రైల్వే స్టేషన్‌ కిటకిట

రైలు ఎక్కేందుకు బోగీల వద్ద గుమికూడిన ప్రయాణికులు

రాయచూరు రూరల్‌: ఈసారి వర్షాభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో ఉపాధి కోసం పొట్టచేతబట్టుకుని కళ్యాణ కర్ణాటక(క–క)లోని పలు జిల్లాల నుంచి వందలాది మంది రాజధాని బెంగళూరుకు వలస వెళుతున్నారు. బీదర్‌, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వెళ్లే వ్యవసాయ కూలీలు ప్రయాణం చేస్తున్నారు. యాదగిరి, రాయచూరు రైల్వే స్టేషన్ల పరిధిలో రైలు బోగీలు పూర్తిగా నిండిపోయి ప్రయాణికులతో కిక్కిరిసి ఆసనాల కింద పడుకొని పిల్లా పాపలతో అడుగు తీసి అడుగు వేయలేనంత రద్దీగా ప్రయాణిస్తున్నారు. లాతూర్‌ నుంచి బీదర్‌ మీదుగా బెంగళూరులోని యశ్వంతపురకు వెళ్లే రైలులో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో రైలు ప్రయాణికులకు తిప్పలు తప్పని పరిస్థితులు దాపురించాయి. పండుగల సమయంలో అదనపు రైళ్లను నడపకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైలుకు అదనపు బోగీలను అమర్చకుండా ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రజల నుంచి సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement