750 అంబులెన్సుల పంపిణీకి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

750 అంబులెన్సుల పంపిణీకి ఏర్పాట్లు

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడానికి వీలుగా ప్రభుత్వం నుంచి ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులకు అందించేందుకు 750 అంబులెన్సులను పంపిణీకి సిద్ధంగా ఉంచామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్‌ వెల్లడించారు. బుధవారం కలబుర్గి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర చికిత్సల కోసం ప్రతి తాలూకాలో ఐదు పడకల ఐసీయూ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి మానసిక, దంత, తల్లీబిడ్డల ఆస్పత్రి, ఆహారం, ఔషధాలు, క్యాన్సర్‌, కిడ్నీవ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్సలు అందిస్తామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం సర్కార్‌ రూ.4600 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ నిధులతో మొరార్జి దేశాయి, మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌, శిశునాళ షరీఫ్‌ పథకాలతో విద్యా రంగానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. హజ్‌ యాత్రలకు వెళ్లే వారిని తక్కువ ఖర్చుతో పంపుతున్నామన్నారు. కలబుర్గి ఎంపీ రాధాకృష్ణ దొడ్డమని, ఎమ్మెల్యేలు అల్లమ ప్రభు పాటిల్‌, కిరణ్‌, రహీంఖాన్‌, తిప్పణప్ప, అరుణ్‌ కుమార్‌ పాటిల్‌, జగదేవ్‌లున్నారు.

మైనార్టీల సంక్షేమానికి సర్కార్‌ రూ.4600 కోట్లు

రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి యూ.టీ. ఖాదర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement