నిరంతర సాగునీటి సరఫరా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

నిరంతర సాగునీటి సరఫరా చేపట్టాలి

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, లింగసూగూరు, దేవదుర్గ, యాదగిరి, సురపుర తాలూకాల్లో నారాయణ పుర కుడి కాలువ ద్వారా ఉపకాలువలకు నిరంతరం సాగునీటిని విడుదల చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు మస్తాన్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం దేవదుర్గ తాలూకా బాపూర్‌ సర్కిల్‌లో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఆర్‌బీసీ కాలువలకు వార బందీ పద్ధతికి స్వస్తి పలికి నిరంతరం సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ యాదగిరిలో రాస్తారోకో చేశారు. కాలువ ఆయకట్టు చివరి భూములకు సాగునీరందించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.

మహిళ ఆత్మహత్య

రాయచూరు రూరల్‌: పొలంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రాత్రి రాయచూరు తాలూకా యాపలదిన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సింగనోడి గ్రామం వద్ద సంభవించింది. మృతురాలిని తెలంగాణలోని గద్వాల తాలూకా కే.టీ.దొడ్డి మండలం నందిన్నికి చెందిన బాపుర మారెమ్మ(41) అనే మహిళగా పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 27న గ్రామం వదిలిందని, 28వ తేదీన పొలంలో ఆత్మహత్య చేసుకుందన్నారు. యాపలదిన్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సీఐ సాబయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement