శివాజీనగర: మైసూరు రాజకుటుంబానికి, సంప్రదాయాలకు ఇస్తున్న గౌరవాన్ని మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. మైసూరు దసరా మహోత్సవాలలో తమకు తీవ్ర అసౌకర్యం కలిగించారని రాజ వంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్ గత కొన్నిరోజులుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం డీకే బెళగావిలో స్పందించారు.
ఇది ప్రభుత్వ వేడుక
దసరా పండుగ ప్రభుత్వ వేడుక అని, తన కార్యక్రమం కాదని సీఎం అన్నారు. మా వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగితే, సరిదిద్దుకోవడానికి మేము సిద్థంగా ఉన్నాము. ప్రమోదాదేవి ఇచ్చిన ప్రకటనను ఇంకా చూడలేదు. ఆమె చెప్పిన విషయాలను గమనించి, ఆమెతో చర్చిస్తాను, ఇది మా ఇద్దరి వ్యక్తిగత విషయం కాదు, యావత్ రాష్ట్ర గౌరవానికి చెందినది అని సీఎం పేర్కొన్నారు.
అన్నీ సంప్రదాయ ప్రకారమే
మైసూరు దసరాలో మొదటి నుంచీ, రాజ కుటుంబాన్ని ఎలా గౌరవించాలనే సంప్రదాయం ప్రకారమే ప్రతిదీ జరిగిందని, పాత వ్యవస్థనే కొనసాగించామని సీఎం అన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని పరోక్షంగా రాజరికం కాదని ఆయన స్పష్టంచేశారు. ఈసారి ప్రశాంత్ అనే కొత్త ఏనుగుతో అంబారీ ఊరేగింపు జరిగిందని, శివమొగ్గలో అంబారీ వేడుకలో గొడవ జరిగిందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ పండుగ మొత్తాన్ని ఒక్క వ్యక్తి నిర్వహించడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికీ ఒక బాధ్యత అప్పగించబడిందని అన్నారు.
మొన్నటి మైసూరు దసరా ఉత్సవాల దృశ్యం
రాజవంశీకులు యదువీర్, ప్రమోదాదేవి
చక్కెర, చెరకు ధరలపై కమిటీ: సీఎం
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ
సీఎం డీకే శివకుమార్
రాజమాత ప్రమోదాదేవి
విమర్శలపై స్పందన
ఆమెతో చర్చిస్తానని వెల్లడి
చెరకు రైతుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం డీకే శివకుమార్ బెళగావి సువర్ణసౌధలో సోమవారం అర్ధరాత్రి వరకూ రైతులతో భేటీ జరిపారు. చక్కెర ఫ్యాక్టరీల యజమానులు, రైతులతో జరిగిన చర్చలు విజయవంతమైనట్లు సీఎం ప్రకటించారు. మంగళవారం బెళగావి సర్క్యూట్ హౌస్‌లో మాట్లాడారు. చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి వరుసగా రెండు పగళ్లు, రాత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. రైతులు దేశానికి గొప్ప సంపద అని, వారిని కాపాడి, వారికి న్యాయం అందించడం మన కర్తవ్యమని చెప్పారు. అన్ని ధరలూ పెరిగినా, పదేళ్లుగా చక్కెర ధర మాత్రమే పెరగలేదని అన్నారు. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చక్కెర, చెరకు ధరలను నిర్ణయించకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని విమర్శించారు. చెరకు, చక్కెర ధరలను నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశానని తెలిపారు.


