రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఉత్తర, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో తీవ్ర కరువు సంభవించినందున రైతులకు కరువు పరిహారం అందించాలని అఖిల కర్ణాటక ప్రాంత రైతు సంఘం జిల్లాధ్యక్షుడు వీరేష్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎకరాకు కేంద్రం రూ.25 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేలు చొప్పున సహాయం అందించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో రూ.700 కూలి కేటాయించాలని, నారాయణ పుర కుడి కాలువకు నవంబర్ 30, తుంగభద్ర ఎడమ కాలువకు డిసెంబర్ 31 వరకు నీటిని విడుదల చేయాలన్నారు.


