డిసెంబర్‌ 31 వరకు నీరందించండి | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 31 వరకు నీరందించండి

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువకు డిసెంబర్‌ 31 వరకు నీరు అందించాలని రైతు సంఘం నాయకుడు అమీన్‌పాషా డిమాండ్‌ చేశారు. మంగళవారం సింధనూరులో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల రూ.కోట్లాది రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతులు వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రద్దు చేయడానికి వెనకడుగు వేయడాన్ని ఖండించారు. రైతుల పంప్‌సెట్లకు 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. ఆందోళనలో చంద్రశేఖర్‌, పూజార్‌, బసవరాజ్‌, శివరాజ్‌, సోమనాథ్‌, నిరుపాది, శంకరగౌడ, సిద్దనగౌడ, గోవిందరెడ్డి, యంకనగౌడలతో పాటు రైతులు పాల్గొన్నారు.

వైభవంగా

ఉద్భవ యల్లమ్మ ఉత్సవాలు

రాయచూరు రూరల్‌ : జ్యోతి కాలనీలో వెలసిన సౌదత్తి ఉద్భవ యల్లమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. పున్నమి సందర్భంగా విశేష పూజలు చేసి అర్చకురాలు భవిష్య వాణిని వినిపించారు. కరువు నెలకొందని, రబీలో వానలు కురుస్తాయని రైతులు కొంచెం ఊపిరి పీల్చుకుంటారని అన్నారు. అర్చకులు విజయేంద్ర, పద్మావతి, నయన, సుమంగలమ్మ, విజయలక్ష్మి, శరణమ్మ, శశికళ, రాజేశ్వరి, శ్యామల, వీణాలున్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

● పరుగు పందెంలో గ్రామీణ బాలిక వీణ సత్తా

హొసపేటె: కూడ్లిగి తాలూకా మొరబనహళ్లి గ్రామానికి చెందిన కూలి చేసుకొనే దంపతుల కుమార్తె వీణ పరుగు పందెంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై గ్రామానికి కీర్తి తెచ్చింది. కూడ్లిగి మెయిన్‌ బాయ్స్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వీణ ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. తండ్రి అంజినప్ప ప్రోత్సాహం, ఉపాధ్యాయుడు శివానంద శిక్షణతో వీణ ఈ ఘనత సాధించింది. గ్రామస్తులు ఆమెను ఘనంగా సన్మానించి, మిఠాయిలు పంపిణీ చేసి అభినందించారు.

దొంగల బెడదతో బిక్కుబిక్కు

రాయచూరు రూరల్‌: నగరంలో పలు కాలనీల్లో దొంగల భయం అధికమైంది. సోమవారం రాత్రి ఆశాపూర్‌ కాలనీల్లో దొంగలు కత్తులు పట్టుకుని ఇళ్ల వైపు చోరీలు చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రజలు వారికి భయపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్ల నుంచి రాత్రి పూట పోలీసు గస్తీ తిరగడం మానేయడంతో దొంగలకు ఇళ్లలో చోరీలు చేయడానికి అవకాశం కల్పించినట్లయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఇంటి వద్ద ఒక్కరే ఉన్న ప్రాంతంలో తాళం వేసుకుని ఉన్న వారి భయం అధికంగా వెంటాడుతోంది. పోలీసుల రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం గంజాయి మత్తులో కిరాణ వ్యాపారి పట్ట పగలే హత్యకు గురి కావడంతో రాయచూరు బిహార్‌ మాదిరిగా మారే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు.

సాంఘిక దురాచారంపై

అధికారుల తనిఖీ

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా నాగరాళలోని హోటల్‌లో ఎస్సీ కులానికి చెందిన ఓ వ్యక్తికి జగ్గుతో దోసిలిలోకి నీరు పోసి తాగించిన వైనం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు గ్రామాన్ని సందర్శించారు. మంగళవారం లింగసూగూరు డీఎస్పీ సులేమాన్‌, తహసీల్దార్‌ గ్రామంలో పరిశీలించిన అనంతరం శాంతి సమావేశం నిర్వహించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, హోటల్‌ యజమానిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement