ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

బనశంకరి: ప్రతిష్టాత్మకంగా సాగిన 4 ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఫలితాలు వచ్చిన 2 చోట్లా జేడీఎస్‌, బీజేపీ గెలుపొందాయి. బెంగళూరు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ క్షేత్రం ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థి ఏపీ రంగనాథ్‌ గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పుట్టణ్ణ ఓడిపోయారు. మైసూరు బ్యాంక్‌ సర్కిల్‌ వద్ద ఆర్ట్స్‌ కాలేజీలో కౌంటింగ్‌ జరిగింది. మొత్తం 27,405 మంది ఓటర్లు ఉండగా, 22,468 ఓట్లు పోలయ్యాయి. రంగనాథ్‌కు 10,810 ఓట్లు, పుట్టణ్ణ 9,902 ఓట్లు వచ్చాయి. 908 ఓట్ల తేడాతో జేడీఎస్‌– బీజేపీ అభ్యర్థి రంగనాథ్‌ గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కార్యకర్తలు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.

ఎక్కడెక్కడ ఎన్నికలు?

పశ్చిమ పట్టభద్రుల స్థానం, ఆగ్నేయ పట్టభద్రుల స్థానం, ఈశాన్య ఉపాధ్యాయుల క్షేత్రం, బెంగళూరు ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు హోరాహోరీగా ఎన్నికల పర్వం సాగింది. బీజేపీ–జేడీఎస్‌ కూటమిగా బరిలోకి దిగాయి. బెంగళూరులో జేడీఎస్‌, మిగతా చోట్ల బీజేపీ అభ్యర్థులు నిలిచారు. మిగతా రెండు స్థానాల్లో అధికార హస్తం– బీజేపీ నువ్వానేనా అనేలా ఉన్నాయి. లెక్కింపు ఆలస్యంగా సాగుతోంది.

ఐదోసారి శశీల్‌ నమోషీ విజయ బావుటా

సాక్షి,బళ్లారి: ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విధాన పరిషత్‌ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన శశీల్‌ నమోషీ ఘన విజయం సాధించారు. మంగళవారం కలబుర్గిలోని యూనివర్సిటీలో జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రారంభం నుంచి నమోషీ తన అధిక్యతను చాటుతూ వచ్చారు. మొదటి రౌండ్‌ నుంచి అధిక్యత చాటుతూ రావడంతో రెండవ రౌండ్‌లోనే దాదాపు 3,232 ఓట్ల ఆధిక్యత కనబరిచారు. బళ్లారిలోని రాయల్‌ సర్కిల్‌ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి టపాసులు పేలుస్తూ, స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పాల్గొన్నారు.

4 సీట్లలో 2 గెలుపు

మరో రెండింటిలో కౌంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement