త్వరలో కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

త్వరలో కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం ఏర్పాటు

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

రాయచూరు రూరల్‌: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు రాయచూరు జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ రాజశేఖర్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటన్‌–2 కార్యక్రమంలో భాగంగా తాలూకా స్థాయి అధ్యక్ష పదవుల నియామకానికి కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. సంఘటన్‌–1 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి అధ్యక్షుల నియామక ప్రక్రియలో 1,100 మందికి సంబంధించి కార్యకర్తల అభిప్రాయ సేకరణను వంద శాతం పూర్తి చేసినట్లు వివరించారు. అదే పద్ధతిలో సంఘటన్‌–2లో భాగంగా తాలూకా స్థాయి అధ్యక్ష పదవుల నియామకానికి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు నవంబర్‌ 10వ తేదీ వరకు గడువు విధించినట్లు వెల్లడించారు. సమావేశంలో జాన్‌ వెస్లీ, లోక్‌సభ సభ్యుడు కుమార్‌ నాయక్‌, శాంతప్ప, నిర్మల, ఆంజనేయ, రజాక్‌, శ్రీనివాస్‌ రెడ్డి, జయన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement