పిల్లలకు విదేశీ చదువులొద్దు | - | Sakshi
Sakshi News home page

పిల్లలకు విదేశీ చదువులొద్దు

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

రాయచూరు రూరల్‌: చదువు కోసం విదేశాలకు పిల్లలను పంపవద్దని కిల్లే బృహన్మఠం శాంతమల్ల శివాచార్య అభిప్రాయ పడ్డారు. మంగళవారం కిల్లే బృహన్మఠంలో శరన్నవ రాత్రి ముగింపు ఉత్సవాల్లో 88వ శ్రీదేవి పురాణ ప్రవచన సభలో భక్తులనుద్దేశించి ప్రసంగించారు. పిల్లలకు సనాతన, సంస్కృతి, ఆచార విచారాలు తెలియ చేయాలన్నారు. పిల్లలకు విదేశీ చదువుల వల్ల మాతృభాష మనుగడకు భంగం వాటిల్లుతుందని, భారత దేశంపై గౌరవం తగ్గిపోతుందన్నారు. మన దేశంలో విద్య వల్ల నైతిక విలువలు అలవడతాయన్నారు.

శుభ్రతపై కవితలు రాయాలి

రాయచూరు రూరల్‌: నగరంలో పరిసరాల శుభ్రతపై కవితలు రాయాలని నగరసభ కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో పిలుపునిచ్చారు. నగరంలోని మక్కా దర్వాజలో ఏర్పాటు చేసిన దసరా బహు భాషా కవిగోష్టిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. కవులు తమ కలాన్ని స్థానిక సమస్యలపై ఎక్కు పెట్టాలన్నారు. స్వచ్ఛతపై రచనలు చేసి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఆంజనేయ, నాగరాజ్‌, రఘునాథ్‌రెడ్డి, సిద్దయ్య, దండెప్ప బిరాదార్‌, సంతోష్‌ కుమార్‌, రావుత్‌రావ్‌లున్నారు.

వ్యక్తి దారుణ హత్య

సాక్షి,బళ్లారి: భార్యపై అనుమానం పెనుభూతమై అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన జరిగింది. వివరాలు.. నగరంలోని కౌల్‌బజార్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బుధవారం సాయంత్రం తాపీ మేసీ్త్ర పనులు చేసుకుని జీవించే నజరతుల్లా(40) అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో జాగృతి నగర్‌కు చెందిన ముక్తార్‌ అహమ్మద్‌(30)ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కౌల్‌బజార్‌లో కలకలం రేపింది. కౌల్‌బజార్‌ పోలీసులు నజరతుల్లాను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌ సరఫరా

మెరుగు పరచరూ

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాను సక్రమంగా చేయాలని కోరుతూ సిరవార కన్నడ రక్షణా వేదిక జెస్కాం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సంచాలకుడు నాగరాజ్‌ నేతృత్వంలో బుధవారం జెస్కాం కార్యాలయాన్ని కరవే కార్యకర్తలు ముట్టడించి అధికారులను దిగ్బంధించారు. 12 గంటల పాటు విద్యుత్‌ పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా లేక కరువు సహాయక పనులు చేపట్టక పోవడాన్ని ఖండించారు. కరువు నెలకొన్నందున రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని, రైతులకు 12 గంటల పాటు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ కింద ఉపకాలువలకు నీటి విడుదలలో నిర్లక్ష్యం తగదని కోరుతూ కార్యాలయం వద్ద అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

లావాదేవీల్లో మనస్పర్థలతో స్నేహితుడి హత్య

రాయచూరు రూరల్‌: రైతులు పండించిన శనగల కొనుగోలు వ్యవహారంలో జరిగిన తప్పిదంతో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసి తన స్నేహితుడినే హత్య చేసిన ఘటన గదగ్‌ జిల్లా నరగుంద తాలూకా సురకోడలో చోటు చేసుకుంది. 11 రోజుల క్రితం తప్పిపోయిన ద్యావప్ప గోజగనూరు(62) అనే వ్యక్తి ఈనెల 19వ తేదీన శవంగా కనిపించాడు. శనగలను కొనుగోలు చేయడానికి ద్యావప్ప అనే వ్యక్తి శరణప్పతో రూ.80 లక్షలకు బాండ్‌ పేపర్‌ రాయించుకున్నాడు. ద్యావప్ప వడ్డీ వ్యాపారాలు చేస్తు్‌ండేవాడని, ఇద్దరి మధ్య లావాదేవీల్లో వచ్చిన మనస్పర్థలు హత్యకు దారి తీశాయని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement