భక్తిశ్రద్ధలతో మధ్వాచార్య జయంతి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో మధ్వాచార్య జయంతి

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

బళ్లారిఅర్బన్‌: నగరంలోని సత్యనారాయణపేట ప్రధాన రహదారిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో బుధవారం మధ్వాచార్య జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మధ్వారాధన చేపట్టారు. అనంతరం మధ్వాచార్యుల చిత్రపటం, పవిత్ర గ్రంథాలతో కూడిన రథయాత్రను రాఘవేంద్ర స్వామి మఠం నుంచి సత్యనారాయణపేట ప్రధాన రహదారి మీదుగా వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించారు. కోలాటాలు, భక్తుల సందడి మధ్య సాగిన రథయాత్ర తిరిగి మఠానికి చేరుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది నుంచి విప్ర బంధువులందరూ కలిసి మధ్వాచార్య జయంతిని నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

రాయచూరు రూరల్‌ : సమాజంలో ఉత్తమ వాగ్గేయకారుడిగా పేరొందిన సంగీత విద్వాంసుల్లో మధ్వాచార్యులు ఒకరని తహీసీల్దార్‌ సురేష్‌వర్మ పేర్కొన్నారు. ఆయన బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందరింలో ఏర్పాటు చేసిన మధ్వాచార్యుల జయంతిని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి మధ్వాచార్య జయంతి ఆచరణకు శ్రీకారం చుట్టిందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. త్రివిక్రం జోషి, రాఘవేంద్ర, శ్రీనివాస్‌, వేణుగోపాల్‌, పండిట్‌ ఆనందాచార్‌, శ్రీహరిచార్‌, రవీంద్రాచార్‌, వినోద్‌ సాగర్‌, రమేష్‌ కులకర్ణి, జయరాజ కుమార్‌, ప్రవీణ్‌, జయకుమార్‌ దేశాయిలున్నారు.

పురవీధ ుల్లో ఘనంగా రథయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement