నీటి పన్ను చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌ | - | Sakshi
Sakshi News home page

నీటి పన్ను చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

హుబ్లీ: అణ్ణిగేరిలో నీటి పన్ను బకాయిలను నాలుగు రోజుల్లోగా చెల్లించక పోతే కొళాయి నీటి సరఫరా పూర్తిగా బంద్‌ చేస్తామని అణ్ణిగేరి మున్సిపాల్టీ ముఖ్యాధికారి గద్దిగౌడర్‌ హెచ్చరించారు. అణ్ణిగేరిలో నిరంతర సేవలను మున్సిపాల్టీ ద్వారా అందిస్తున్నారు. 2023 నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు రూ.కోటి బకాయి పడ్డాయి. ప్రతి నెలా పన్ను చెల్లించాలని ఎన్ని సార్లు అవగాహన కల్పించినా ప్రజలు స్పందించడం లేదని ఆయన వాపోయారు. పన్ను చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, నివాసాలు, హోటళ్లు తదితర కొళాయి కనెక్షన్లను పూర్తిగా తొలగిస్తామన్నారు. కనెక్షన్‌ తొలగిస్తే ముందుగా బకాయి సొమ్ము, అలానే జరిమానా మొత్తాన్ని సంబంధిత కార్యాలయాల్లో చెల్లించాలన్నారు. ఆ తర్వాత తిరిగి కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. నియమానుసారంగా విధించే రీ–కనెక్షన్‌ శుల్కాన్ని చెల్లించాక తమ సిబ్బంది కొళాయి కనెక్షన్‌ను పునరుద్ధరిస్తారన్నారు. అణ్ణిగేరి ప్రజలు మున్సిపాల్టీతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మంచి వర్షాలతో

త్వరలో రాష్ట్రం సుభిక్షం

● కోడి మఠాధిపతి శివానంద శివయోగి జోస్యం

హుబ్లీ: రాష్ట్రంలో వర్షాలు, పంటలు, రాజకీయాల గురించి కోడి మఠం స్వామి సరికొత్త జోస్యం చెప్పారు. ధార్వాడలో జరిగిన జంబుసవారీ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చక్కటి రబీ వర్షాలు కురవడంతో రాష్ట్రం సుభిక్షం అవుతుందన్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల గురించి స్పష్టంగా సమాధానం చెప్పని ఆయన కుతూహలం రేకెత్తించారు. ప్రతి ఏటా దసరా తదితర సందర్భాల్లో కోడి మఠం డాక్టర్‌ శివానంద శివయోగి జోస్యం చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి జోస్యం నిజమవుతుందని పలువు భక్తులు నమ్ముతారు. గతంలో ఆయన చెప్పిన జోస్యాలు నిజమయ్యాయని చెబుతున్నారు. ఆయన ధార్వాడలో జరిగిన జంబుసవారీ ఉత్సవంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్షాల గురించి మాట్లాడుతూ రబీ సీజన్‌లో వర్షాలు బాగా పడతాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. నేను ఇదివరకే చెప్పినట్లుగా ఖరీఫ్‌ వానలు తగినంత కురవవని, వర్షాభావంతో అన్నం కొరత, ప్రజాజీవితంలో తీవ్రమైన ఇక్కట్లు ఎదురవుతాయని చెప్పానన్నారు. ప్రస్తుతం రబీలో మాత్రం ఉత్తమ వర్షాలు పడతాయి. దీంతో రాష్ట్రంలో సమృద్ధి కలిగి ప్రజలు ఎదుర్కొనే కష్టాలు తొలిగిపోయి శాంతి సమాధానం లభిస్తుంది. జలాశయాలు, జలవనరులకు మంచి జరగనుంది. అఖండ కర్ణాటక సాహిత్యం, సంస్కృతి, జనజీవితం, రైతులు, కార్మికులు తదితర సమస్త మానవాళి ఒక్కటిగా నడవాలని ఆయన ఆశయం వ్యక్తం చేశారు.

బీజేపీ అభ్యర్థి గెలుపుపై ధీమా

హుబ్లీ: పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గం విధాన పరిషత్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎస్‌వీ సంకనూరు గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తారని, కనీసం 8 వేల మెజార్టీ వస్తుందని మాజీ మంత్రి మురుగేష్‌ నిరాణి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంకనూరు రెండు సార్లు ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గెలుపొంది సమాజంలోని అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి విధాన పరిషత్‌లో గళం ఎత్తారన్నారు. నిరాడంబర వ్యక్తిత్వంతో చిత్తశుద్ధితో ప్రజల కోసం పాటుపడే ఎస్‌వీ సంకనూరును ఈసారి కూడా గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement