శాంతిభద్రతల రక్షణలో పోలీసులు కీలకం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల రక్షణలో పోలీసులు కీలకం

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

సాక్షి,బళ్లారి: శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిద్దలింగ ప్రభు పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలోని డీఏఆర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. పోలీసులు, న్యాయవ్యవస్థ పరస్పర సహకారంతో పని చేసినప్పుడే దేశంలో చట్టబద్ధ పాలనను పటిష్టంగా అమలు చేయవచ్చన్నారు. విధి నిర్వహణలో ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారని, అలాంటి వారిని ఎన్నటికీ మరవకూడదన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలన్నారు. గత ఏడాది కాలంలో అమరులైన కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా 154 మంది పోలీసు సిబ్బంది, అధికారుల త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్‌ మాట్లాడుతూ గత ఏడాది అమరులైన ఇన్‌స్పెక్టర్‌ పంచయ్య వీరయ్య సాలిమఠ, ఎస్‌ఐ బసవరాజు, కానిస్టేబుల్‌ బీరలింగ, హెడ్‌కానిస్టేబుల్‌ తాపీ తదితరులను స్మరించారు. అంతకు ముందు జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. సివిల్‌ న్యాయమూర్తి రాజేష్‌ హొసమనె, జెడ్పీ సీఈఓ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల విధి

రాయచూరు రూరల్‌: సమాజంలో శాంతి భద్రతలకు తోడు రక్షణ కల్పించే విషయంలో పోలీసుల సేవలు శ్లాఘనీయమని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. బుధవారం పోలీసు క్రీడా మైదానంలో పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఉగ్రవాదం, నక్సలిజం వంటి విషయాల్లో పోలీసుల కృషిని ప్రశంసించారు. పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రజల ప్రాణాలను రక్షించడంలో తమ జీవితాలను సైతం పణంగా పెడుతున్నారన్నారు. జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి మాట్లాడుతూ 1959 అక్టోబరు 21న అప్పటి డీఎస్పీ కరణ్‌ సింగ్‌తో పాటు 9 మంది పోలీసులు ప్రజల ప్రాణాలను రక్షించడంలో తమ ప్రాణాలను త్యాగం చేసినందుకు పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అమరుల ప్రాణ త్యాగాన్ని ఎన్నటికీ మరవకూడదన్నారు. ఏఎస్పీ హరీష్‌, డీఎస్పీ శాంత కుమార్‌, సీఐలు దాదావలి, నింగప్ప, ఎస్సైలు ప్రకాష్‌ డంబళ్‌, వైశాలిలున్నారు.

రాయచూరులో మాట్లాడుతున్న జిల్లాధికారిణి పూవిత, పాల్గొన్న అధికారులు

బళ్లారిలో పోలీసు అమర వీరుల దినోత్సవంలో పాల్గొన్న అతిథులు

పోలీసులు, న్యాయ వ్యవస్థ

సమన్వయంతో పని చేయాలి

అమర వీరుల దినోత్సవంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిద్ధలింగ ప్రభు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement