వెదురు బజారులో భారీ అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

వెదురు బజారులో భారీ అగ్నిప్రమాదం

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

దట్టంగా అలుముకున్న పొగ

చెలరేగుతున్న మంటలు

హొసపేటె: హోస్పేట్‌ నగరంలోని వాల్మీకి సర్కిల్‌ సమీపంలో ఉన్న వెదురు బజారులో గురువారం రాత్రి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వెదురు దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే పక్కనున్న దుకాణాలను వ్యాపించాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో గంగాధర్‌, ఎం.సీ.తాయేష్‌, ఎంసీ.గంగమ్మకు చెందిన వెదురు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. కుబేర, వెంకటేష్‌కు చెందిన రెండు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న హోస్పేట్‌ డీఎస్పీ పి.మురళీధర్‌, టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పీఐ ఫెజుల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెదురు దుకాణాల్లో జరిగిన ఈ అగ్నిప్రమాదం వ్యాపారులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

రూ.15 లక్షల ఆస్తి నష్టం

అగ్నికి ఆహుతైన వెదురు దుకాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement