రైతుల టోల్‌ బంద్‌తో ట్రాఫిక్‌ అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

రైతుల టోల్‌ బంద్‌తో ట్రాఫిక్‌ అస్తవ్యస్తం

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

హొసపేటె: రైతుల టోల్‌ బంద్‌ ప్రభావంతో హొసపేటె పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ తీవ్రంగా స్తంభించింది. మంగళవారం రైతుల ఆందోళన నేపథ్యంలో జాతీయ రహదారి– 50 పై ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీబీ డ్యాం ప్రాంతంలోని సాయిబాబా సర్కిల్‌ వద్ద కూడా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వాహనాలు ముందుకు కదలకపోవడంతో వాహనదారుల్లో అసహసం వ్యక్తమైంది. మరో వైపు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రైతుల టోల్‌ బంద్‌ ప్రభావంతో హొసపేటె పరిసర ప్రాంతాల్లో జనజీవనం, రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. హైవేపై ఏర్పడిన ట్రాఫిక్‌ సమస్యను త్వరగా పరిష్కరించి, వాహనాల రాకపోకలను సాధారణ స్థితికి తేవాలని వాహనదారులు కోరారు.

జాతీయ రహదారి పూర్తిగా మూసివేత

కిలోమీటర్ల మేర వాహనాల నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement