సీఈసీని తొలగించాలని జైల్‌ భరో | - | Sakshi
Sakshi News home page

సీఈసీని తొలగించాలని జైల్‌ భరో

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

రాయచూరు రూరల్‌: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సర్‌ ఓటర్ల నమోదు ప్రక్రియలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, సీపీఐఎంఎల్‌ డిమాండ్‌ చేశాయి. సోమవారం కలబుర్గి రైల్వే స్టేషన్‌లో ఆందోళన చేపట్టిన సంచాలకురాలు సుజాత, రాయచూరు అంబేడ్కర్‌ సర్కిల్‌లో సీపీఐఎంఎల్‌ నేత మారెప్ప మాట్లాడారు. భారత ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌, వివేక్‌ జోషి సర్‌ను ఎలా అమలు చేయాలనే అంశంలో ఓటర్లను దారి తప్పించే ప్రయత్నంలో ఉన్నారన్నారు. సీఈసీని డిిస్మిస్‌ చేయాలని, సర్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ రైలు పట్టాలు, ప్లాట్‌ఫాంలపై నిరసన వ్యక్తం చేశారు. రాయచూరులో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని కొంతసేపటి తర్వాత వదిలిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement