డీ.హిరేహాళ్(బొమ్మనహాళ్): భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన డీ.హిరేహాళ్ మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు...కర్ణాటకలోని బళ్లారి జిల్లా జానెకుంటె గ్రామానికి చెందిన కవితమ్మ (34)ను 18 ఏళ్ల క్రితం చెర్లోపల్లికి చెందిన బులెప్ప అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన బులెప్ప రోజూ తాగి వచ్చి కవితమ్మను వేధించేవాడు. దీంతో మనస్తాపం చెందిన కవితమ్మ బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్‌కు తరలించారు. మృతురాలి తమ్ముడు తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీ.హిరేహాళ్ ఎస్‌ఐ తెలిపారు.


