రాయచూరు రూరల్: రాయచూరులో జరగనున్న నాడహబ్బ దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశామని మహానగర పాలికె కమిషనర్ జుబీన్ మహాపాత్రో పేర్కొన్నారు. మంగళవారం మహానగర పాలికె కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రజల అభిప్రాయాల సేకరణ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నందున అక్టోబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు దసరా పండుగ ఊరేగింపు ప్రారంభమై బన్నిమంటపం వరకు కుంభ మేళాలతో నిర్వహిస్తారన్నారు. సమావేశంలో శరణప్ప, మురళీధర్, భరత్, శాంతప్ప, జయన్న, శరణప్ప, శివ కుమార్, కమల్ కుమార్, లక్ష్మీకాంత్, వెంకటేష్, ఆంజనేయ, ఈరణ్ణలున్నారు.


