● కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ
హొసపేటె: రుణమాఫీతో పాటు తమ పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సోమవారం రైతులు భారీ నిరసన చేపట్టారు. హొసపేటె పునీత్ సర్కిల్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు వందలాది మంది రైతులు ర్యాలీ నిర్వహించారు. 8 గంటల విద్యుత్, రుణమాఫీ, కరువు సహాయంతో పాటు పలు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారీ సంఖ్యలో రైతులు నిరసనలో పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని రైతులు ఒత్తిడి చేశారు. డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మరింత భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


