యశవంతపుర: ఉడుపి పట్టణంలోని అలెవూరు–దెందూరుకట్ట వద్ద పెట్రోల్ బంకుకు సమీపంలో ప్రైవేట్ బస్సులో మంటలు వ్యాపించి కాలిబూడిదైంది. బస్సులో మంటలు వ్యాపించగానే పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పక్కన నిలిపిన రెండు బస్సులు, ఒక టెంపోకు మంటలు వ్యాపించకుండా బంకు సిబ్బంది అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో బస్సు కాలి బూడిదైంది. ఈ బస్సులు పెట్రోల్ బంకుకు చెందిన యజమానివిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.


