ఫిరంగులకు ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ఫిరంగులకు ప్రత్యేక పూజలు

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ మైసూరు దసరా మహోత్సవ్‌–2026 కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. విజయదశమి జంబూ సవారీలోని ముఖ్య సంప్రదాయాల్లో ఒకటైన ప్యాలెస్‌ ప్రాంగణంలో ఫిరంగులకు పోలీసులు శుక్రవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. మైసూరు ప్యాలెస్‌లో ఉన్న ఏనుగు గేటు సమీపంలోని 11 ఫిరంగులకు నగర పోలీస్‌ కమిషనర్‌ సీమా లాట్కర్‌ ఆధ్వర్యంలో రాజభవన పురోహితుడు ప్రహ్లాదరావు ధార్మిక ఆచారాలతో పూజ చేశారు. విజయదశమి రోజున జరిగే జంబూ సవారీ ఊరేగింపులో 21 ఫిరంగులను కాల్చడంతో దసరా వైభవం మరింత పెరగనుంది. ముఖ్యమంత్రితో సహా ప్రముఖులు బంగారు ఫలకంలో ప్రతిష్ఠించిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. ఆ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తారు. జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు పోలీసులు 21 సార్లు ఫిరంగులు పేలుస్తూ వందనం చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఏసీపీ సోమశేఖర్‌ నాయకత్వంలో, 35 మంది సీఏఆర్‌ పోలీసులు నగరంలోని దొడ్డకెరె మైదానంలో 7 ఫిరంగులతో మూడు రోజుల పాటు 21 సార్లు కాల్పుల విన్యాసం నిర్వహిస్తారు. అనంతరం బన్నిమంటపంలో కూడా ఈ విన్యాసం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement