మావటీల పిల్లలకు అక్షర గంధం | - | Sakshi
Sakshi News home page

మావటీల పిల్లలకు అక్షర గంధం

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలకు అడవుల నుంచి ఏనుగుల వెంట వచ్చిన మావటీలు, కాపలాదారుల కుటుంబాలు నగర జీవితానికి అలవాటు పడ్డారు. ఇక వారి పిల్లల కోసం విద్యాశాఖ అధికారులు ప్యాలెస్‌ ఆవరణలో తాత్కాలిక పాఠశాలను తెరిచారు. పలక, బలపం, పుస్తకాలను, అలాగే మిఠాయిలను అందజేశారు. దసరా తర్వాత ఏనుగులు తిరిగి వెళ్లే వరకు ప్రతిరోజూ పాఠశాల ఉంటుంది. మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు అందిస్తారు. అధికారులు, టీచర్లు పాల్గొన్నారు. అలాగే ఏనుగులకు ఇసుక బస్తాలు కట్టి సాధన చేయించారు. సీఎం డీకే శివకుమార్‌ పదవి చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా గురువారం రాత్రి ప్యాలెస్‌ను విద్యుద్దీపాలతో సింగారించారు. 14వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు దీపకాంతుల్లో వెలుగులీనుతుంది.

ఆశలు నింపే ఆపద్బాంధవులు

శివాజీనగర: కన్నడనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా పురోగమిస్తుంటే, కుటుంబాల్లో సంక్షోభాలు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ తీరని విషాదాన్ని మిగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలను నివారించడానికి, వారికి నిరంతరం కౌన్సెలింగ్‌ ద్వారా అండగా నిలిచేందుకు అర్బన్‌ సెల్ప్‌–హార్మ్‌ స్టడీ ప్రాజెక్టును రాష్ట్రంలోని 37 ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరిస్తున్నారు. నిమ్హాన్స్‌, రాష్ట్ర ప్రభుత్వం, పలు కార్పొరేట్‌ కంపెనీల సహకారంతో కొనసాగిస్తారు. ప్రస్తుతం 10 జిల్లాల్లోని 16 ఆసుపత్రులలో మాత్రమే ఈ ఉషస్‌ పథకం అమలవుతోంది. ఏడాదిలోగా దానిని మొత్తం 31 జిల్లా ఆసుపత్రులకు, బెంగళూరులోని 6 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినవారు చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యే వరకు, అలాగే మరికొంతకాలం నిపుణులు మానసిక స్థైర్యం కల్పిస్తూ కౌన్సెలింగ్‌ ఇస్తారు.

అత్యధిక బలవన్మరణాలు: మంత్రి

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్‌ మాట్లాడుతూ జాతీయ నేర గణాంక రికార్డుల బ్యూరో ప్రకారం 2024లో భారతదేశంలో 1,70,746 ఆత్మహత్యల మరణాలు నమోదైనట్లు తెలిపారు. వీటిలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలలో కర్ణాటక ఒకటని చెప్పారు. ఆత్మహత్యాయత్యం చేసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందిస్తారని, వారి మానసిక స్థితిని అంచనా వేసి, వారికి కౌన్సెలింగ్‌, భవిష్యత్తుకు అవసరమైన నైతిక మద్దతు అందిస్తామని తెలిపారు.

ప్యాలెస్‌ ఆవరణలో పాఠశాల

గజరాజుల సాధన

ఆత్మహత్యాయత్నం

బాధితులకు ఉషస్‌ కౌన్సెలింగ్‌

అన్ని జిల్లాలకు విస్తరణ

నిమ్హాన్స్‌, సర్కారు చొరవ

ధైర్యం నింపుతారు

2022 నుంచి ఇప్పటి వరకు 35,436 ఆత్మహత్యాయత్నం చేసినవారికి ఉషస్‌ కింద సహాయం అందించారు. 26,385 మందికి కౌన్సెలింగ్‌, నిరంతరం వివరాలను కనుక్కుంటూ కుటుంబాలను అప్రమత్తం చేశారు. కౌన్సెలింగ్‌ పొందిన వారిలో కేవలం 1.3 శాతం మంది మాత్రమే తిరిగి ఆత్మహత్యలకు ప్రయత్నించగా, 0.3 శాతం మంది మరణించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే రెండోదఫా ఆత్మహత్యాయత్నాలు బాగా తగ్గాయని వైద్య నిపుణులు తెలిపారు. అవమానం, భయం, ఒంటరితనంతో బాధపడేవారికి ఉషస్‌ చికిత్సతో ధైర్యం నింపడమే లక్ష్యమని నిమ్హాన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.సీ.జనార్ధనరెడ్డి తెలిపారు. నెలల తరబడి రోగితో సంప్రదింపులు జరిపేందుకు శిక్షణ పొందిన నిపుణులు ఉంటారని, రెండోసారి ఆత్మహత్యాయత్నం చేయకుండా నివారిస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement